లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లోని కుందార్కి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొరాదాబాద్ -ఆగ్రా రహదారిపై బస్సు-ట్రక్కు డీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో పదిమందికి తీవ్ర గాయాలయ్యా యి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మొరాదాబాద్ రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ .2 లక్షలు, గాయపడినవారికి రూ .50 వేలు చొప్పున ఎక్స్ గ్రేషియాను ముఖ్యమంత్రి యోగి ప్రకటించారు. క్షతగాత్రులకు తగిన వైద్య చికిత్సలు అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
At least seven Dead in Moradabad Road Accident