Tuesday, December 24, 2024

బాణసంచా ఫ్యాక్టరీలో మంటలు.. 10 మంది మృతి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కర్నాటక, తమిళనాడు సరిహద్దుల్లోని అత్తిబెల్లి శనివారం ఓ బాణసంచా ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 10 మంది ఘటనాస్థలిలోనే మృతి చెందారు. 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి కారణాలు తెలిసిరాలేదు. శనివారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది ఈ దశలో ఫ్యాక్టరీలో దాదాపు 30 మంది వరకూ ఉన్నట్లు తెలిసింది. సరిహద్దుల్లోని ఈ ప్రాంతం అధికారికంగా తమిళనాడు రాష్ట్రంలోకి వస్తుంది.

అయితే మంటలు చెలరేగిన గంట సేపటికి కర్నాటక వైపు నుంచి అక్కడి అగ్నిమాపక శకటాలు వచ్చినట్లు తెలిసింది. ఈ ఘటనతో హోసూర్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయింది. ఇక్కడ ఫ్యాక్టరీతో పాటు గోడౌన్, దుకాణాలు కూడా ఉండటంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు. దీపావళి అమ్మకాలకు భారీస్థాయిలో గోడౌన్లలో బాణసంచాను అన్‌లోడ్ చేస్తున్నప్పుడు మంటలు చెలరేగినట్లు వెల్లడైంది. తీవ్రంగా గాయపడ్డ వారిలో ఈ బాణసంచా ఫ్యాక్టరీ/ గిడ్డంగి యజమాని కూడా ఉన్నట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News