- Advertisement -
సియూడాడ్ మాడిరో : మెక్సికో ఉత్తరప్రాంతంలో ఆదివారం ప్రార్థనల సమయంలో ఓ చర్చి పై భాగం కుప్పకూలింది. ఈ ఘటనలో కనీసం పది మంది వరకూ శిథిలాల కింద నలిగి మృతి చెందారు. దాదాపు 60 మంది వరకూ గాయపడ్డారు. ఆదివారం నుంచి సోమవారం వరకూ శిథిలాల తొలిగింపు, గాయపడ్డ వారిని వెలికితీయడం సాగుతూ వచ్చింది. ఇప్పటివరకూ పది భౌతికకాయలను వెలికితీశారు.టమౌలిపస్ రాష్ట్రంలోని తీర పట్టణం సియూడాడ్ మాడిరోలో జరిగిన ఈ ఘటనలో ఇప్పటికీ మరో 30 మంది వరకూ శిథిలాల కింద పడి ఉన్నారని తెలిసింది. ఫ్లడ్‌లైట్ల సాయంతో సైనిక సిబ్బంది, సహాయక బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. మృతులలో ఐదుగురు మహిళలు, ఇద్దరు పురుషులు, ముగ్గురు బాలలు ఉన్నట్లు రాష్ట్ర గవరనర్ అమెరికో విలార్‌రిల్ తెలిపారు.
- Advertisement -