Sunday, December 22, 2024

పెళ్లి వేడుకలో ఘోర అగ్నిప్రమాదం.. వధూవరులతో పాటు 100మందికి పైగా మృతి

- Advertisement -
- Advertisement -

ఇరాక్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఇరాక్ – అల్-హమదనియాలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు పెళ్లి వేడుకల్లో మంటలు అలుముకుని వేగంగా వ్యాపించడంతో వధూవరులతో పాటు దాదాపు 100 మందికి పైగా మరణించారు. ఈ ప్రమాదంలో 600మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

అగ్నిప్రమాదం జరగగానే ఫంక్షన్ హాల్లో స్లాబ్ కుప్పకూలిందని, డెకరేషన్ ఐటమ్స్ వల్ల వేగంగా మంటలు వ్యాపించాయని, ప్రమాద సమయంలో ఫంక్షన్ హాల్లో దాదాపు 1,000 మంది ఉన్నారని అధికారులు చెప్పారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News