Wednesday, January 22, 2025

కరాచీ షాపింగ్ మాల్‌లో అగ్ని ప్రమాదం..11 మంది మృతి

- Advertisement -
- Advertisement -

కరాచీ : పాకిస్థాన్ లోని కరాచీనగరంలో ఓ షాపింగ్ మాల్ లో శనివారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ షాపింగ్ మాల్ రెండో అంతస్తులో మొదట మంటలు చెలరేగి నాలుగు, ఐదు, ఆరు అంతస్తులకు వ్యాపించాయి. 12 అగ్నిమాపక శకటాలు, 50 మంది సిబ్బంది రంగం లోకి దిగి మంటలను ఆర్పడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ భవనంలో చిక్కుకున్న 42 మందిని రక్షించగలిగారు. పొగకమ్ముకుని ఊపిరాడక పోవడంతో 11 మంది చనిపోయారని చీఫ్ ఫైర్ ఆఫీసర్ ముబిన్ అహ్మద్ చెప్పారు.

తొమ్మిది మృతదేహాలను జిన్నా ఆస్పత్రికి, మరో రెండు మృతదేహాలను సివిల్ ఆస్పత్రికి తరలించామని పోలీస్ అధికారిసుమ్మయ సయ్యద్ తెలిపారు. ఈ అగ్ని ప్రమాదనికి కారణాలు ఏమిటో దర్యాప్తు చేస్తున్నామని ఫైర్ ఆఫీసర్ ముబిన్ అహ్మద్ తెలియజేశారు. కరాచీ లోని నివాస, వాణిజ్య, పారిశ్రామిక నిర్మాణాల్లో 90 శాతం అగ్నిప్రమాదాలను నివారించే ఏర్పాట్లు కానీ, వ్యవస్థలు కానీ ఈ వారం మొదట్లో జరిగిన సదస్సులో సిటీ ప్లానర్సు, ఇంజినీర్లు హెచ్చరించారని ముబిన్ అహ్మద్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News