- Advertisement -
రష్యా దక్షిణ రీజియన్ డాజెస్టాన్ ప్రాంతీయ రాజధాని మఖచ్‌కళా లో గ్యాస్ సర్వీస్ స్టేషన్‌లో శుక్రవారం పేలుడు సంభవించి 13 మంది మృతి చెందారు. మంటలు పక్కనున్న ఫలహారశాలకు కూడా వ్యాపించాయని అధికారులు శనివారం వెల్లడించారు. తరువాత మంటలను ఆర్పివేయగలిగామన్నారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారని రష్యా అత్యవసర మంత్రిత్వశాఖ వెల్లడించింది. మాస్కోకు 1600 కిమీ దూరంలో మఖచ్‌కళా ఉంది. ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్టు ప్రాంతీయ అధికారులు వెల్లడించారు. డాజెస్థాన్‌లో శనివారం సంతాప దినంగా ప్రకటించారు. గత ఆగస్టులో డాజెస్థాన్ లోని గ్యాస్ స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించి 35 మంది మృతి చెందగా, 115 మంది గాయపడ్డారు.
- Advertisement -