Sunday, December 22, 2024

గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో 13 మంది మృతి

- Advertisement -
- Advertisement -

గాజాపై ఇజ్రాయెల్ జరిపిన రెండు వేర్వేరు దాడుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. గాజా లోని తూర్పు తుఫా పరిసరాల్లోని తాత్కాలిక శిబిరంగా ఉన్న పాఠశాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఆరుగురు మరణించారని, మృతుల్లో ఇద్దరు స్థానిక జర్నలిస్టులు, ఓ గర్భిణి, ఓ చిన్నారి ఉన్నట్టు గాజా ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలియజేసింది.అయితే పాలస్తీనా ఇస్లామిక్ జిహాదీ మిలిటెంట్ గ్రూపునకు చెందిన ఉగ్రమూకలనే లక్షంగా చేసుకుని తాము దాడి చేశామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. అలాగే ఖాన్ యూనిస్‌లో నిరాశ్రయులు ఆశ్రయం పొందుతున్న స్థావరంపై కూడా ఇజ్రాయెల్ దాడులు జరపగా ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారని నాస్సెర్ ఆస్పత్రి వెల్లడించింది. ఈ దాడికి ఇజ్రాయెల్ మిలిటరీ తక్షణమే స్పందించడం లేదు. మరోవైపు ఆహారం,నీరు, వైద్య సామగ్రితో కూడిన 11 ట్రక్కులు గాజాకు చేరుకున్నాయి.

వీటిని మానవతాసాయం కింద జాబాలియా లోని అర్బన్ శరణార్థుల శిబిరంతో సహా ఇతర శరణార్థులకు ఇజ్రాయెల్ సైనిక సంస్థ కొగొట్ పంపింది. గత నెల ఇజ్రాయెల్ తాజాగా మిలిటరీ చర్యలు ప్రారంభించిన తరువాత మొట్టమొదటిసారిగా ఇజ్రాయెల్ నుంచి మానవతాసాయం అందడం ఇదే మొదటిసారి. గాజాలో నిర్వాసితులకు తక్షణమే మానవతాసాయం అందించాలని అమెరికా గడువు విధించిన తరువాతనే ఈ సాయం అందడం గమనార్హం. ఉత్తర గాజాలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి పాఠశాలలు, శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటివరకు 43,000 మందికి పైగా మరణించినట్టు పాలస్తీనా ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News