Sunday, January 19, 2025

వడదెబ్బతో కనీసం 14 మంది మృతి

- Advertisement -
- Advertisement -

ఒడిశా సుందర్‌గఢ్ జిల్లాలో వడదెబ్బకు గురైనట్లుగా అనుమానిస్తున్న కనీసం 14 మంది మరణించారని, రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ఈ సముద్రతీర రాష్ట్రంలో పరిస్థితులు దుర్భరంగా మారాయని అధికారులు తెలియజేశారు. రౌర్కెలా ప్రభుత్వ ఆసుపత్రిలో పది మరణాలు, సుందర్‌గఢ్ జిల్లా ఆసుపత్రిలో నాలుగు మరణాలు నమోదు అయ్యాయి. మరణాలకు మండే ఎండల సంబంధిత అస్వస్థతలు, వడదెబ్బలు కారణం కావచ్చునని ఆసుపత్రిలో వైద్యులు సూచించారు. ‘రౌర్కెలాలో ఎండలు మరీ దుర్భరంగా ఉన్నాయి. పశ్చిమ ఒడిశాలో కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అందుకే కొందరు అస్వస్థతకు గురయ్యారు’ అని రౌర్కెలా అదనపు జిల్లా మేజిస్ట్రేట్ అశుతోష్ కుల్కర్ణి తెలిపారు. మండే ఎండల అస్వస్థతతో 44 మంది ఆసుపత్రిలో చేరారని ఆయన తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News