Sunday, January 19, 2025

ఆఫ్ఘనిస్తాన్‌లోని మసీదులో పేలుడు: మతగురువు సహా 18 మంది మృతి

- Advertisement -
- Advertisement -

 

Blast

హెరాత్: పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లోని రద్దీగా ఉండే మసీదులో శుక్రవారం పేలుడు సంభవించి, కనీసం 18 మంది మరణించారు, ఇందులో ఒక ప్రముఖ మత గురువు, తాలిబాన్ అధికారులు , స్థానిక వైద్యుడు ఉన్నారు. కనీసం 21 మంది గాయపడ్డారు. గుజర్గా మసీదులో పేలుడు సంభవించింది. పశ్చిమ నగరంలోని హెరాత్‌లోని గుజార్‌గా మసీదులో శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో ఈ పేలుడు సంభవించింది.

ఈ పేలుడులో గత రెండు దశాబ్దాలుగా దేశంలోని పాశ్చాత్య-మద్దతు గల ప్రభుత్వాలను విమర్శించి ఆఫ్ఘనిస్తాన్ అంతటా ప్రసిద్ధి చెందిన ప్రముఖ మత గురువు ముజీబ్-ఉల్ రెహ్మాన్ అన్సారీ మరణించారు. అన్సారీ తాలిబాన్‌లకు సన్నిహితుడు. విదేశీ దళాలు వెళ్లిపోయాక అతడు దేశాన్ని తన నియంత్రణలోకి తీసుకున్నాడు. అతని మరణాన్ని తాలిబాన్ చీఫ్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ధృవీకరించారు. హెరాత్‌ పేలుడులో 18 మృతదేహాలు,  21 మంది క్షతగాత్రులను  అంబులెన్స్‌లు ఆసుపత్రులకు తరలించాయని హెరాత్ అంబులెన్స్ సెంటర్ అధికారి మహ్మద్ దౌద్ మొహమ్మది తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News