Monday, December 23, 2024

అమెరికాలో టోర్నడోల విధ్వంసం.. 23 మంది మృతి

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: అమెరికాలో సుడిగాలులు (టోర్నడోలు) విధ్వంసం సృష్టించాయి. ఇక్కడి మిసిసిపి రాష్ట్రంలో బలమైన గాలులతోపాటు ఓ టోర్నడో ధాటికి దాదాపు 23 మంది మృతి చెందారు. అనేక మంది స్థానికులు గాయపడ్డారు. మరో నలుగురు గల్లంతయ్యారు. సుడిగాలుల బీభత్సానికి మిసిసిపీ, అలబామా, టెన్నసీ,ల్లో వేల సంఖ్యలో ఇళ్లు ధ్వంసం కావడంతోపాటు అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అధికారులు వెల్లడించారు.

గత 24 గంటల వ్యవధిలో మిసిసిపీ, అలబామాల్లో 11 టోర్నడోలు నమోదైనట్టు చెప్పారు. టోర్నడోల ధాటికి ముఖ్యంగా మిసిసిపీలో షార్కీ కౌంటీ లోని సిల్వర్ సిటీ, రోలింగ్ ఫోర్క్, జాక్సన్‌లతో పాటు వినోనా, హంఫ్రీస్ , కరోల్ కౌంటీలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అలబామా, మిసిసిపీ, టెనసీ వ్యాప్తంగా 83 వేలకు పైగా ఇళ్లు , కార్యాలయాలకు విద్యుత్ సరఫరా నిల్చిపోయినట్టు పవర్‌ఔటేజ్ వెబ్‌సైట్ తెలిపింది. విపత్తు బాధితులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News