Saturday, September 14, 2024

బంగ్లాదేశ్‌లో దారుణం..హోటల్‌లో 24 మంది సజీవ దహనం

- Advertisement -
- Advertisement -

బంగ్లాదేశ్‌లో అవామీ లీగ్ చీఫ్ షేఖ్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, దేశం నుంచి పారిపోయిన తరువాత అవామీ లీగ్ నేత ఒకరి యాజమాన్యంలోని స్టార్ హోటల్‌లో ఇండోనేషియన్ జాతీయునితో సహా కనీసం 24 మంది వ్యక్తులను ఒక గుంపు సజీవ దహనం చేసినట్లు స్థానిక జర్నలిస్టులు, ఆసుపత్రి వర్గాలు మంగళవారం వెల్లడించాయి. జషోర్ జిల్లా అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి షాహీన్ చక్లాదర్ యాజమాన్యంలో జిల్లాలో గల జబీర్ ఇంటర్నేషనల్ హోటల్‌కు మూకలు సోమవారంరాత్రి పొద్దు పోయిన తరువాత నిప్పు పెట్టగా 24 మంది సజీవ దహనం అయ్యారు.

వారిలో చాలా మంది హోటల్‌లో బస చేస్తున్నవారే. మృతుల్లో ఒక ఇండోనేషియన్ జాతీయుడు కూడా ఉన్నట్లు స్థానిక జర్నలిస్ట్ ఒకరు ఫోన్‌లో ఢాకాలో ‘పిటిఐ’కి తెలియజేశారు. తాము 24 మృతదేహాలను లెక్కించినట్లు జషోర్ జనరల్ ఆసుపత్రిలో డాక్టర్లు ధ్రువీకరించారని ఆయన తెలిపారు. కాగా, శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు ఉండవచ్చునని ప్రాణాలతో బయటపడిన హోటల్ సిబ్బంది సూచించారు. మీడియా వార్తల ప్రకారం, అవామీ లీగ్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న గుర్తు తెలియని మూకలు హోటల్ కింది అంతస్తుకు నిప్పంటించారు. ఆ జ్వాలలు పై అంతస్తులకు వేగంగా వ్యాపించాయి. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇటువంటి దౌర్జన్యకర సంఘటనలు చోటు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News