28 మంది మృతి..73 మందికి గాయాలు
బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరంలో గురువారం రెండు ఆత్మాహుతి బాంబు దాడులు 28 మందిని బలిగొన్నాయి. మరో 73 మంది ఈ బాంబు దాడులలో గాయపడ్డారు. సెంట్రల్ బాగ్దాద్‌లో అత్యంత బిజీగా ఉండే బాబ్ అల్-షర్కీ మార్కెట్ ప్రాంతంలో ఈ ఘోర సంఘటన చోటుచేసుకుంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఇరాక్‌లో త్వరలో ఎన్నికలు జరపాలని ప్రతిపాదిస్తుండగా రాజకీయ వేడి ఏర్పడిన తరుణంలో ఈ దాడులు జరిగాయి. బాంబు దాడుల అనంతరం ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. బాంబు పేలుళ్లకు పలువురు మాంసపు ముద్దలుగా మారగా అనేక మంది తీవ్రంగా గాయపడి జీవచ్ఛవాలుగా మిగిలారు. ప్రాణాలు దక్కించుకున్న వారు భయాందోళనలతో పరుగులు తీయగా ఎక్కడ చూసినా చెల్లాచెదురుగా పడి ఉన్న చెప్పులు, బట్టలతో మార్కెట్ ప్రాంతం నిండిపోయింది. ఈ దాడికి బాధ్యులం తామేనంటూ ఇప్పటివరకు ఎవరూ ముందుకు రాలేదు. బాంబు దాడులలో కనీసం 28 మంది మరణించగా మరో 73 మంది గాయపడ్డారని, వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని ఇరాక్ సైన్యం తెలిపింది.
at least 28 dead as suicide bombing in Baghdad