- Advertisement -
కైరో : ఈజిప్టులోని అలెగ్జాండ్రియా సిటీ , కైరో అనుసంధాన జాతీయ రాదారిపై ఓ ఘోర గొలుసుకట్టు ప్రమాదంలో కనీసం 32 మంది మృతి చెందారు. 63 మంది వరకూ గాయపడ్డారు. ఈ దారిలో వేగంగా వెళ్లుతున్న మూడు ప్రయాణికుల బస్సులు , కొన్ని వాహనాలు ఢీకొనడంతో తొలుత కొన్నింటిలో చెలరేగిన మంటలు ఇతర వాహనాలకు కూడా పాకాయి. దీనితో హైవే అంతా దట్టమైన పొగలు, ఉధృతిస్థాయి మంటలతో భయానక పరిస్థితి ఏర్పడింది. పలువురు వాహనాలు నడుపుతూ ఉండగానే సజీవ దహనం చెందారు. ముందు బస్సు దాని వెనుక పది వాహనాలు ముందు ఢీకొనడం హైవే విధ్వంసానికి దారితీసింది. ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున అంబులెన్స్‌లు తరలివచ్చాయి. సమీప ఆసుపత్రులకు ప్రజలను తరలించారు.
- Advertisement -