Wednesday, January 22, 2025

రాష్ట్రంలో బిసిలకు కనీసం 40 సీట్లు ఇప్పించాలి

- Advertisement -
- Advertisement -

సిఎల్పీ నేత భట్టి విక్రమార్కకు వినతిపత్రం అందించిన టిపిసిసి బిసి నేతలు

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో బిసిలకు కనీసం 40 సీట్లు ఇప్పించాలని, అప్పుడే కాంగ్రెస్ పార్టీ సులువుగా అధికారంలోకి వస్తుందని ఆ సామాజిక వర్గ నేతలు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కోరారు. సోమవారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసంలో టిపిసిసి బిసి నేతలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రెండు అసెంబ్లీ స్థానాలకు తగ్గకుండా బిసి అభ్యర్థులను కేటాయించాలని కోరుతూ వారు వినతిపత్రాన్ని అందజేశారు. స్క్రీనింగ్ కమిటీ, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అభ్యర్థుల ఫిల్టర్ తర్వాత 57 మంది బిసి అభ్యర్థులు తేలారని, వీరిలో 40 మందికి తగ్గకుండా టికెట్లు ఇస్తే అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతుందని వారు వివరించారు.

జనాభా ప్రకారం అన్ని రాజకీయ పార్టీలకు బిసిల ఓట్లే కీలకం అనే అంశాన్ని వారు గుర్తుచేశారు. హైకమాండ్‌తో ప్రత్యేకంగా మాట్లాడి సీట్లు ఇప్పించాలని బిసి నేతలు భట్టిని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, కత్తి వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News