Sunday, December 22, 2024

మధ్య ప్రదేశ్‌లో 47 మంది శిశువుల జననం

- Advertisement -
- Advertisement -

భోపాల్ : అయోధ్య ఆలయంలో రామ్ లల్లా విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ వేడుక జరుగుతుండగా సోమవారం మధ్య ప్రదేశ్‌లోని మూడు జిల్లాలలో వేర్వేరు ఆసుపత్రులలో కనీసం 47 మంది శిశువులు జన్మించినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇండోర్‌లోని మూడు ఆసుపత్రులలో 33 మంది శిశువులు జన్మించగా, దామోహ్‌లో 13 మంది, భోపాల్‌లో ఒకరు పుట్టినట్లు వారు తెలిపారు. ఇండోర్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలోని పిసి సేథి ఆసుపత్రిలో 9 మంది ఆడపిల్లలు, 9 మంది మగపిల్లలు వెరసి 18 మంది జన్మించారని డాక్టర్ వీరేంద్ర రాజ్‌గిర్ తెలియజేశారు.

ఇండోర్‌లోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎంటిహెచ్ ఆసుపత్రిలో 11 మంది శిశువులది సహజ ప్రసవం కాగా, ముగ్గురు సిజేరియన్ ఆపరేషన్ ద్వారా పుట్టారని సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ సుమిత్రా యాదవ్ తెలిపారు. దీపల్‌పూర్ సివిల్ ఆసుపత్రిలో సిజేరియన్ ద్వారా ఒక ఆడ శిశువు జన్మించినట్లు డాక్టర్ సుష్మా బోరివల్ తెలిపారు. భోపాల్‌లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో సిజేరియన్ ద్వారా ఒక మగ శిశువు జన్మించినట్లు డాక్టర్ మనీషా జైన్ చెప్పారు. దామోహ్ జిల్లాలో సోమవారం ఏడుగురు మగ శిశువులు, ఆరుగురు ఆడ శిశువులు పుట్టినట్లు ఆర్‌ఎంఒ డాక్టర్ విశాల్ శుక్లా తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News