Saturday, November 16, 2024

పంజ్‌షీర్‌లో తాలిబన్లకు మళ్లీ ఎదురుదెబ్బ

- Advertisement -
- Advertisement -
At least 8 Taliban soldiers killed in Panjshir
8 మందిని హతమార్చిన ప్రత్యేక దళాలు

కాబూల్ : పంజ్‌షీర్ ప్రావిన్స్‌లో తాలిబన్లకు మరోమారు ఎదురుదెబ్బ తగిలింది. ఆఫ్ఘనిస్థాన్ గడ్డ నుంచి అమెరికా సేనలు వెళ్లిపోయిన గంటల్లోనే పంజ్‌షీర్‌పై సోమవారంనాడు రాత్రి తాలిబన్లు విరుచుకుపడ్డారు. అయితే తాలిబన్ వ్యతిరేక దళాల నుంచి వారికి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అంతేకాదు, ఈ పోరులో తాము ఏడు నుంచి ఎనిమిదిమంది తాలిబన్లను మట్టుబెట్టినట్టు అహ్మద్ మసౌద్ అధికార ప్రతినిధి ఫాహిత్ దష్తీ తెలిపారు. ఇరువైపులా కొందరికి గాయాలైనట్టు పేర్కొన్నారు. పంజ్‌షీర్‌లో తాలిబన్ వ్యతిరేక దళాలతో చేతులు కలిపిన ఆఫ్ఘనిస్థాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్ సామాజిక మాధ్యమాల ద్వారా బాహ్య ప్రపంచానికి మెసేజ్‌లు పంపకుండా ఉండేందుకు తాలిబన్లు ఆదివారం పంజ్‌షీర్‌లో ఇంటర్నెట్‌ను నిలిపివేశారు. ఆగస్టు 15న ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు అధీనంలోకి తీసుకున్న తర్వాత అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం నుంచి పారిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News