Thursday, January 23, 2025

ఫుట్‌బాల్ స్టేడియంలో తొక్కిసలాట..9 మంది దుర్మరణం

- Advertisement -
- Advertisement -

సాన్ సాల్వెడార్ : ఎల్ సాల్వెడార్ దేశ రాజధాని సాన్ సాల్వెడార్‌లోని ఫుట్‌బాల్ స్టేడియంలో శనివారం రాత్రి తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఫుట్‌బాల్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ను చూడడానికి భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. అయితే ఒక్కసారిగా స్టేడియం లోకి వెళ్లేందుకు ఒకే గేటు ద్వారా దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. కస్కట్లాన్ స్టేడియం మైదానంలో అలియాంజా, ఎఫ్‌ఎఎస్ జట్ల మధ్య మాచ్ జరుగుతుండగా ఒక్కసారి జనంలో తొక్కిసలాట జరిగిందని నేషనల్ సివిల్ పోలీస్ తమ ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు.రిస్కు కమాండోస్ ఫస్ట్ ఎయిడ్ గ్రూప్స్ అధికార ప్రతినిధి కెర్లోస్ ఫ్యూయెంటెస్ మరణాలను ధ్రువీకరించారు.

మృతుల్లో ఏడుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారని తెలిపారు. దాదాపు 500 మందికి పైగా చికిత్స అందిస్తున్నామని, తీవ్రంగా గాయపడిన వంద మందిని ఆస్పత్రులకు తరలించామని వీరిలో కొందరి పరిస్థితి క్లిష్టంగా ఉందని తెలిపారు. 16 నిమిషాల సేపు మ్యాచ్‌ను ఆపేశారు. తొక్కిసలాట జరిగిన తరువాత అక్కడి దశ్యాలు స్థానిక టెలివిజన్ ప్రసారం చేసింది.అభిమానులు ఒక్కసారి గేటు ద్వారా దూసుకుని పోడానికి ప్రయత్నించడం వల్లనే తొక్కిసలాట జరిగిందని ప్రాథమిక నివేదిక వెల్లడించిందని ఈల్ సాల్వడార్ సాసర్స్ ఫస్ట్ డివిజన్ ప్రెసిడెంట్ పెడ్రో హెర్నాండెజ్ వివరించారు. ఈ సంఘటనపై అటార్నీజనరల్ కార్యాలయ సహకారంతో దర్యాప్తు చేస్తామని నేషనల్ సివిల్ పోలీస్ కమిషనర్ మారిసియో అరిజా చికాస్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సాల్వడార్ సాసర్ ఫెడరేషన్ సంతాపం వెలిబుచ్చింది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News