Thursday, January 23, 2025

రాజశ్యామల దేవి మందిరం వద్ద…

- Advertisement -
- Advertisement -

శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామితో కలిసి జమ్మి చెట్టు నాటిన ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్

మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ కొకాపేటలోని విశాఖ శారదా పీఠం వారి ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న రాజ శ్యామల దేవి మందిరం వద్ద శారదా పీఠం విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామితో కలిసి మందిర ఆవరణలో రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ జోగినపల్లి సంతోష్ కుమార్ జమ్మి చెట్టును నాటారు. దేవాలయ పరిధిలో మొక్కను నాటడం చాలా ఆనందంగా ఉందన్నారు. గతంలో కూడా గుడి, గుడికి జమ్మి చెట్టు పేరుతో ప్రతీ దేవాలయ పరిధిలో జమ్మి చెట్టును నాటామని గుర్తు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల చారి, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి,వంశిధర్‌రావు, వేద పండితులు పాల్గొన్నారు.

At Rajashyamala Devi Mandir...

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News