Monday, December 23, 2024

ఎస్ సిఓ శిఖరాగ్ర సమావేశంలో భేటీకానున్న మోడీ, జిన్ పింగ్

- Advertisement -
- Advertisement -

 

Modi and Zinping

సమర్కండ్: ప్రాంతీయ భద్రతా గ్రూప్ అయిన ‘ఎస్‌సిఓ’ శిఖరాగ్ర సమావేశాలు గురువారం ఉజ్బెకిస్థాన్ నగరమైన సమర్కండ్‌లో మొదలు కాబోతున్నాయి. ఈ సమావేశానికి చైనా నాయకుడు జి జిన్‌పింగ్, రష్యా నాయకుడు పుతిన్ కూడా హాజరుకాబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. కాగా ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ శుక్రవారం మళ్లీ చాలా రోజుల తర్వాత ఎదురెదురు కాబోతున్నారు. ఇరుదేశాల మధ్య సరిహద్దు గొడవల కారణంగా 2020 నుంచి వీరి మధ్య ఎలాంటి భేటీ జరగలేదు. ఈ సమావేశంలో పాల్గొనడంతో పాటుగా మోడీ ద్వైపాక్షిక సమావేశాలు కూడా నెరుపుతారని భారత విదేశీ కార్యదర్శి వినయ్ క్వాత్రావిలేకరుల సమావేశంలో తెలిపారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సిఓ)లో చైనా, భారత్, రష్యా, కజకిస్థాన్, కిర్ఘిస్థాన్, తజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, పాకిస్థాన్ శాశ్వత సభ్యత దేశాలుగా ఉన్నాయి. మోడీ, పుతిన్‌ల మధ్య ద్వైపాక్షిక సమావేశం జరుగుతుందని రష్యా కూడా ధృవీకరించింది. ఈ సమావేశం సందర్భంగా ఎరువులు, పరస్పర ఆహార దినుసుల సరఫరా గురించి వీరిరువురు మాట్లాడతారని కూడా తెలిసింది. ఈ సమావేశంలో వాణిజ్యం, ప్రాంతీయ భద్రత, పర్యాటకం, టెర్రరిజం వంటి విషయాలపై చర్చలు జరుగుతాయాని క్వాత్రా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News