Thursday, January 23, 2025

రాష్ట్రపతి నిలయంలో… అగ్నిభద్రతపై విద్యార్థులకు అవగాహనా సదస్సు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : అగ్ని భద్రతపై విద్యార్థినీ విద్యార్థులకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో గురువారం అవగాహన కలిగించే విధముగా అవగాహనా సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమం తెలంగాణ విపత్తు ప్రతిస్పందన, అగ్నిమాపక సేవల విభాగం ఆధ్వర్యంలో జరిగింది. భాష్యం బ్రూక్స్, శాంతినికేతన్, సెయింట్ మేరీస్ ఉన్నత పాఠశాల, శివ శివాని కాలేజీ, సివిఆర్ ఇంజనీరింగ్ కళాశాల, ఎంపిపిఎస్, స్వామి రామానంద తీర్థ మెమోరియల్, రెడ్ క్రాస్ వాలంటీర్ (భవన్స్ కాలేజీ), తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, గాంధీ మెడికల్ కాలేజీ, సిఎంఆర్ కాలేజీ తదితర పాఠశాలలు, కళాశాలల నుండి హాజరైన విద్యార్థినీ విద్యార్థులకు అగ్ని భద్రత, పారిశ్రామిక అగ్ని భద్రతా చర్యల గురించి అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి నిలయ సివిల్, ఎలక్ట్రికల్ సిబ్బంది. ఐటిబిపి, టిఎస్‌ఎస్‌పి సెక్యూరిటీ పాల్గొన్నారు. తెలంగాణ విపత్తు ప్రతిస్పందన, అగ్నిమాపక సేవల విభాగం. అగ్ని భద్రతకు సంబందించిన వీడియోస్ ప్రదర్శిస్తూ మోక్ డ్రిల్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సహాయక జిల్లా అగ్నిమాపక అధికారి .జె.రంజిత్ రెడి, కంటోన్మెంట్ అగ్నిమాపక కేంద్రం స్టేషన్ అగ్ని మా సాక అధికారి రాఘవ్ రెడ్డి, స్టేషన్ అగ్నిమాపాక అధికారి శివ ప్రసాద్, సిబ్బంది హాజరయ్యారు. అగ్నిమాపక చర్యల ఆవశ్యకత ఇప్పటి ఆధునిక పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉన్నందున ఇటువంటి అవగాహనా కార్యక్రమాలు విద్యార్థుల నిమిత్తం నిర్వహించడం జరుగుతుందని రాష్ట్రపతి నిలయ అధికారి డా.కె.రజని ప్రియ తెలిపారు.

Fire Safety 2

Fire Safety 3

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News