Sunday, January 19, 2025

మండపాల వద్ద… చిన్న పాటి జాగ్రత్తలతో విద్యుత్ ప్రమాదాలు దూరం

- Advertisement -
- Advertisement -

At Vinayaka mandapam electrical precautions

 

మన తెలంగాణ, హైదరాబాద్ : హిందువులకు అత్యంత ఇష్టమైన పండుగల్లో గణేష్ నరాత్రులు ఒకటి. ఈ సందర్భంగా గ్రేటర్ వ్యాప్తంగా వేలాది గణేష్ మండపాలను నిర్వహకులు తమ శక్తి కొలది ఏర్నాటు చేస్తుంటారు. వీటిలో భాగంగా ఆయా మండపాలకు విద్యుత్ దీపాలను అలంకరిస్తుంటారు. ఈ నెల 31 నుంచి జరగనున్న గణేష్ నవరాత్రుల సందర్శంగా నిర్వహకులు విద్యుత్ పరమైన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. మండప అలంకరణ కోసం ఇష్టం వచ్చినట్లుగా విద్యుత్‌ను కరెంటు స్తంభాలు నుంచి తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. మండప నిర్వహణలో విద్యుత్‌పట్ల ఏ మాత్రం అశ్రద్ద వహించినా ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.మండపాలలో విద్యుత్ ఫిటింగ్‌ను లైసెన్స్ పొందిన కాంట్రాక్టర్ ద్వారానే చేయించాలని సూచిస్తున్నారు. మండపాలలో విద్యుత్ నిర్వహణను వైర్‌మెన్ లైసెన్స్ పొందిన సూపర్ వైజర్ల ఆధ్వర్యంలో పర్యవేక్షించాలన్నారు. మంటపాల సమీపంలో ఏర్పాటు చేసే విద్యుత్ సరఫరా కోసం నాణ్యమైన విద్యుత్ కరెంట్ వైర్లను వినియోగించాలని చెబుతున్నారు.

ఎర్త్ లీకేజ్, సర్కూట్ బ్రేకర్‌ను ( ఈఎస్‌సిబి)ని ఇన్ కమింగ్, ఔట్ గోయింగ్ దగ్గర ఏర్పాటు చేయాలన్నారు. సబ్ సర్యూట్‌లో వైర్లలో 2.5 చదరపు ఎంఎంకు తగ్గకుండా లోడ్ ( విద్యుత్ సామర్థం) ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి సర్కూట్ లోడ్‌కు 800 వాట్స్ మించి ఉండాలంటున్నారు. ఫేజ్ న్యూట్రల్, ఎర్త్‌వైర్‌ను అన్ని సమాన సైజ్‌లలో ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యంగా లైట్ల కోసం సిల్క్ వైర్లను ఉపయోగించ వద్దన్నారు. ప్రతి సర్కూట్ న్యూట్రల్, ఎర్త్ వైర్లను విడివిడిగా ఏర్పాటు చేసుకోవాలంటున్నారు. ప్రతి మండంప వద్ద ఎర్తింగ్ పిట్ ఏర్పాటు చేయాలని చెబుతున్నారు. 25 ఎంఎం డయా గుంతతో పాటు మూడు మీటర్ల పొడవైన జిఐ పైపు ఎర్త్ రాడ్స్ నిబంధనల ప్రకారం ఏర్పాటు చేయాలని చెబుతున్నారు. మండపాల్లో విద్యుత్ స్టౌ లాంటి వాటిని ఉపయోగించవద్దని తెలిపారు.

అతుకులు ఎక్కువగా లేకుండా, చూడాలని, అతుకుల వద్ద టేపులను ఏర్పాటు చేయాలంటున్నారు. ఎమర్జీన్సీ లైట్‌లను ఉపయోగించాలని, ప్రతి లైట్ ఇతర ఎలాంటి ఫిటింగ్ అయినా సరే 9 అడుగులు ఎత్తులో ఏర్పాటు చేయాలని ప్రతి దానికి త్రీ పిన్ ప్లగ్ సాకెట్స్‌ను వినియోగించాలని చెబుతున్నారు. మండపాలను నిర్వహణకు మార్కెట్‌లో లభించే సాధరణమైన విద్యుత్ పరికరాలను కాకుండా నాణ్యమైన విద్యుత్ పరికారలను వినియోగిస్తూ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News