Friday, December 20, 2024

అచ్చంపేటలో వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి

- Advertisement -
- Advertisement -

అచ్చంపేట: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల బాలింత మృతి చెందింది. ఈ నెల 15న అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణీకి ఆపరేషన్ చేశారు. దర్శన్‌గడ్డ తండాకు చెందిన మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆపరేషన్ సమయంలో దూదిని వైద్యులు కడుపులో మరిచిపోయారు. కడుపులో దూది ఉండడంతో బాలింతకు రెండు రోజుల నుంచి తీవ్ర రక్తస్రావమైంది. బాలింతను హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. అచ్చంపేట అంబేడ్కర్ కూడలిలో మృతురాలి బంధువులు ధర్నాకు దిగారు.

Also Read: ఒవైసీ ముత్తాత బ్రాహ్మణుడా? అసదుద్దీన్ స్పందన ఇది…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News