అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సైకో సిఎం కావడం ప్రజల దురదృష్టమని టిడిపి ఎంఎల్‌ఎ అచ్చెన్నాయుడు తెలిపారు. నెల్లూరు ఎస్‌విజిఎస్ గ్రౌండ్స్‌లో టిడిపి జోన్-4 సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు, మాజీ ఎంఎల్‌ఎలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడారు. నేరుగా అందర్నీ టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలవాలనే జోన్ సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు.
ఎపిలో మరో పార్టీ ఉండకూడదని విర్రవీగి మాట్లాడారని, తనతో సహా ఎంతో మందిపై కేసులు పెట్టి వెధించారన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టిడిపి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అందరూ సిఎంలు కలిసి రెండు లక్షల కోట్లు అప్పులు చేస్తే సిఎం జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే పది లక్షల కోట్లు అప్పులు చేశారని ధ్వజమెత్తారు. ఒక్క ఏడాదిలోనే లక్షా 50 వేల కోట్ల పన్నుల భారం మోపారని మండిపడ్డారు. జగన్ రాయలసీమ బిడ్డ కాదని, రాయలసీమ ద్రోహి అని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు.