Tuesday, December 24, 2024

జగన్ పిచ్చి పరాకాష్టకు చేరింది: అచ్చెన్నాయుడు

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నం: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిచ్చి పరాకాష్టకు చేరిందని టిడిపి నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఎపి మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయడంపై అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. “ప్రతిపక్ష యానకులను జైలులో పెట్టి ఆనందపడుతున్న వ్యక్తి జగన్. రాజకీయ కక్షతో ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టడమే జగన్ పని. తెలుగు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన వ్యక్తి చంద్రబాబు. స్కిల్ కేసులో చంద్రబాబును ఇరికించి అక్రమంగా అరెస్టు చేశారు. దేశంలో ఏ ఒక్కరినీ అడిగినా చంద్రబాబు దార్శనికత చెబుతారు” అని పేర్కొన్నారు.

కాగా, ఎపి ప్రభుత్వం చేపట్టిన స్కిల్‌డెవలప్‌మెంట్ పథకంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అప్పటి సిఎం చంద్రబాబు నాయుడును పోలీసులు శనివారం ఉదయం నంద్యాలలో అరెస్టు చేశారు. దీంతో ఎపి వ్యాప్తంగా టిడిపి శ్రేణులు ఆందోళనలకు దిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News