అమరావతి: ప్రేమించి పెళ్లి చేసుకున్నందు ప్రియురాలిని ప్రియుడు 36 సార్లు పొడిచి చంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ప్రియుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కూర్మన్నపాలెం గ్రామానికి చెందిన గిరిజన యువతి మహాలక్ష్మి(26), గాజువాకకు చెందిన ఎం శ్రీనివాస్‌కుమార్‌ను గాఢంగా ప్రేమించి పెళ్లి చేసుకుంది. మహాలక్ష్మి రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెం సచివాలయంలో వ్యవసాయ సహాయకురాలిగా విధులు నిర్వహిస్తోంది. శ్రీనివాస్ కుమార్ ఉద్యోగం లేకపోవడంతో ఆమెకు జీతంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాడు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులు కట్నం తీసుకరావాలని మహాలక్ష్మిని పలుమార్లు వేధించేవారు. కులం తక్కువ ఆమెను తీసుకొచ్చావని పలుమార్లు వేధించడంతో పాటు గొడవలు పెట్టుకున్నారు.
Also Read: రెండో విడత గొర్రెల పంపిణీకి సర్వం సిద్దం
దీంతో మనస్థాపం చెందిన యువతి తన పుట్టింటికి వెళ్లిపోయి ఉద్యోగం చేస్తోంది. ఆమె పని చేసే చోట, పుట్టింటి వద్ద యువతిని పలుమార్లు శ్రీనివాస్ వేధించేవాడు. విడాకులు ఇప్పించాలని పలుమార్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నానా రకాలుగా ప్రయత్నించిన యువతి తన దగ్గరకు రాకపోవడంతో హత్య చేయాలని ప్లాన్ వేశాడు. ప్లాన్ భాగంగా యువతిని మే 29న కాల్ చేసి అచ్చుతాపురం లాడ్జికి రప్పించాడు. భోజనంలో నిద్ర మాత్రలు కలిపి ఇవ్వడంతో ఆమె తినేసి పడుకుంది, వెంటనే కత్తి తీసుకొని పలుమార్లు ఆమె పొడిచాడు. రూమ్ నుంచి శబ్ధాలు రావడం లాడ్జీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడిన యువతిని ఆస్పత్రికి తరలించారు. యువతిని పరీక్షించిన వైద్యులు ఆమె చనిపోయిందని తెలిపారు. శవ పరీక్ష నివేదికలో ఆమెను 36 సార్లు పొడిచినట్లు తేలింది. మృతురాలి తండ్రి సాంబ ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీనివాసును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.