Monday, January 20, 2025

హోసూర్‌లో రెండవ తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎథర్‌ ఎనర్జీ..

- Advertisement -
- Advertisement -

 

బెంగళూరు: భారతదేశంలో సుప్రసిద్ధ ఈవీ స్కూటర్‌ బ్రాండ్‌, ఎథర్‌ ఎనర్జీ నేడు తమ రెండవ తయారీ కేంద్రాన్ని తమిళనాడులోని హోసూరులో ప్రారంభించింది. ఈ కేంద్రం 300,000 చదరపు అడగుల విస్తీర్ణంలో ఉండటంతో పాటుగా బ్రాండ్‌ తమ ఉత్పత్తి సామర్ధ్యంను సంవత్సరానికి 420,000 యూనిట్లకు విస్తరించుకునేందుకు సైతం తోడ్పడనుంది . అంతేకాదు తమ ప్రతిష్టాత్మక స్కూటర్లు 450 గీ మరియు 450 ప్లస్‌ కోసం పెరుగుతున్న డిమాండ్‌ అవసరాలను సైతం తీర్చనుంది.

ఈ నూతన ప్లాంట్‌ ప్రారంభం గురించి ఎథర్‌ ఎనర్జీ కో–ఫౌండర్‌ మరియు సీటీఓ స్వప్నిల్‌ జైన్‌ మాట్లాడుతూ ‘‘వేగవంతమైన విస్తరణ కార్యక్రమాల వల్ల నాణ్యత సంబంధిత సమస్యలను తీసుకువచ్చే అవకాశాలున్నాయి. సురక్షితమైన, ఆధారపడతగిన ఉత్పత్తులను మా వినియోగదారులకు అందించడం మాకు అత్యంత ప్రాధాన్యతాంశం. అదే లక్ష్యంతో మా ప్లాంట్‌నూ ప్రారంభించాము. మా ప్రక్రియలు మరియు మెషీన్‌లపై మా లోతైన పెట్టుబడులు మరియు ఆవిష్కరణలతో ఈ ప్లాంట్‌, నాణ్యమైన వాహనాలను అందించడంలో మా నాయకత్వ స్ధానాన్ని మరింతగా బలోపేతం చేయడంలో తోడ్పడనుంది’’ అని అన్నారు.

ఎథర్‌ యొక్క నూతన తయారీ కేంద్రం 3లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీనిలో రెండు యూనిట్లు ఉన్నాయి. వాటిలో ఒకటి పూర్తిగా బ్యాటరీ ఉత్పత్తి కోసం అంకితం చేయబడితే, మరోటి వాహన అసెంబ్లీ కోసం అంకితం చేయబడింది. ఈ బ్యాటరీ యూనిట్‌లో ఐదు అసెంబ్లీ లైన్స్‌ ఉన్నాయి. అలాగే వాహన అసెంబ్లీ యూనిట్‌లో రెండు అసెంబ్లీ లైన్స్‌ ఉన్నాయి. ఈ మొత్తం సదుపాయం యొక్క వ్యవస్ధాపక సామర్థ్యం 4,20,000 యూనిట్లు. స్కూటర్ల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను ఇది తీర్చనుంది. అత్యాధునిక సౌకర్యాలు కలిగిన ఈ ఆధునిక ప్లాంట్‌, భారత ప్రభుత్వ ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుంది. అంతేకాదు, దేశంలో స్ధానిక తయారీ అవసరాలకు మరింత తోడ్పాటును అందిస్తుంది. శక్తివంతమైన రీతిలో స్ధానిక వ్యవస్ధలను అభివృద్ధి చేయడం కారణంగా ఎథర్‌ ఎనర్జీకి సంబంధించి అధిక శాతం సరఫరాదారులు తమిళనాడు మరియు కర్నాటక చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన వారు. ఈ కారణం చేతనే ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అత్యంత అనుకూలమైన ప్రాంతంగా హోసూరు నిలిచింది.

ఈ నూతన ఫ్యాక్టరీ గురించి స్వప్నిల్‌ మాట్లాడుతూ ‘‘ హోసూర్‌లో మా నూతన తయారీ కేంద్రంతో ఎథర్‌ ఇప్పుడు నాణ్యతా ప్రమాణాల పరంగా నూతన బెంచ్‌మార్క్‌లను ఈవీ పరిశ్రమలో తయారీ ఆవిష్కరణల పరంగా సృష్టించనుంది. ఈ నూతన కేంద్రం ఇండస్ట్రీ 4.0 ప్రమాణాలను కలిగి ఉండటంతో పాటుగా టెస్టింగ్‌, సిమ్యులేషన్‌, ప్రాసెస్‌ (ఇండస్ట్రీ 4.0), ఫీల్డ్‌ (కనెక్టడ్‌ వెహికల్‌) నుంచి డాటాను తీసుకువచ్చి ప్రపంచ శ్రేణి నాణ్యతతో విద్యుత్‌ స్కూటర్లను అందిస్తుంది. తయారీ పరంగా శ్రేష్టతా ప్రమాణాలపై అధికంగా దృష్టి సారించడం ద్వారా మేము మా టేక్‌ టైమ్‌ 10 రెట్లు, వర్క్‌ కంటెంట్‌ను నాలుగురెట్లు మెరుగుపరుచుకున్నాము. వాహన భద్రత పట్ల మా నిబద్ధత దిశగా, మేము మా స్కూటర్ల కోసం వాహనం మరియు సాఫ్ట్‌వేర్‌ దిశగా ఈ శ్రేణిలో అత్యుత్తమ టెస్టింగ్‌ ప్రమాణాలను కలిగి ఉన్నాము. ప్రస్తుతం మా ప్రతి స్కూటర్‌ 1500కు పైగా అత్యంత కఠినమైన పరీక్షలను ఎదుర్కొంటూ భద్రత,విశ్వసనీయతకు భరోసా అందిస్తున్నాయి’’ అని అన్నారు.

దేశంలో ఈవీ విప్లవంలో నాయకునిగా మారడానికి ఎథర్‌ ఎనర్జీ తీవ్రంగా శ్రమిస్తుంది. తమ తయారీ ప్రక్రియలు పర్యావరణ అనుకూలమనేందుకు భరోసా అందిస్తూ ఈ సదుపాయం సంబంధిత తయారీ ప్రమాణాలన్నీ అందుకుంది. ఈ ఫ్యాక్టరీ నుంచి ఎలాంటి ఉద్గారాలూ వెలువడవు మరియు జీరో వాటర్‌ డిశ్చార్జ్‌గా ఈ ప్లాంట్‌ నిలుస్తుంది. ఈ ఫ్యాక్టరీ లోపల అంతర్గతంగా ఎస్‌టీపీ ఉంది. శుద్ధి చేసిన నీటిని ఫ్లషింగ్‌ మరియు ప్లాంటేషన్‌ కోసం వినియోగిస్తున్నారు. ఈ సదుపాయంలో అసెంబ్లీ లైన్స్‌ మరియు అన్ని విద్యుత్‌ మెటీరియల్స్‌ వద్ద ఎనర్జీ రీజనరేటివ్‌ టెస్టింగ్‌ యూనిట్లు ఉన్నాయి.

ఎథర్‌ ఎనర్జీ తమ రిటైల్‌ కార్యకలాపాలను నూతన మార్కెట్‌లకు విస్తరించడం ద్వారా బలోపేతం చేయాలనుకుంటుంది.ఈ కంపెనీ మార్చి 2023 నాటికి 100 నగరాలలో దాదాపు 150 ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రాలకు విస్తరించాలనుకుంటుంది. చార్జింగ్‌ మౌలిక వసతులపై ఇది అధికంగా పెట్టుబడులు పెట్టడంతో పాటుగా రైడర్‌ కమ్యూనిటీకి సమగ్రమైన అనుభవాలను అందించాలనుకుంటుంది. ఇటీవలనే ఈ కంపెనీ 500కు పైగా ఫాస్ట్‌ చార్జింగ్‌ స్టేషన్‌ల మైలురాయిని అధిగమించింది. అంతేకాదు 2023 ఆర్ధిక సంవత్సరాంతానికి 1400 ఎథర్‌ గ్రిడ్స్‌ను ప్రారంభించడానికి ప్రణాళిక చేసింది. తద్వారా ఈవీ పరిశ్రమ అభివృద్ధికి మద్దతు అందిస్తూనే సౌకర్యవంతంగా ఈవీల వైపు మారేందుకు తోడ్పడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News