Wednesday, January 22, 2025

జూన్‌లో ఎథేర్ ఫ్యామిలీ.. ఈ-స్కూటర్ రిజ్టా ఆవిష్కరణ..?!

- Advertisement -
- Advertisement -

ముంబయి: ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ఎథేర్ ఎనర్జీ తన ఎథేర్ 450ఎస్, ఎథేర్ 450ఎక్స్ స్కూటర్లను అప్ డేట్ చేసింది. రేర్‌లో క్రోమ్ ఫినిష్‌తో బెల్ట్ కవర్ న్యూ ఎథేర్ లోగో వస్తుంది. బెల్ట్ కవర్ సాయంతో వర్షాకాలంలో డర్ట్, బురద నుంచి రక్షణ లభిస్తుంది. ఇకప్రస్తుతం మార్కెట్లో ఎథేర్ మూడు స్కూటర్లు అమ్ముడవుతున్నాయి. వాటిల్లో 450ఎక్స్, 450ఎస్, 450 అపెక్స్ ఉన్నాయి. 450ఎస్ స్కూటర్ రూ.97,547, (ఎక్స్ షోరూమ్), 450ఎక్స్ రూ.1.26 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతున్నాయి. లిమిటెడ్ ఎడిషన్‌గా ఆవిష్కరించిన 450 అపెక్స్ రూ.1.89 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది.

ఎథేర్ ఈ స్కూటర్ ఇంటి వద్ద 6.36 గంటల్లో 80 శాతం చార్జింగ్ అవుతుంది. రీ జనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ గల కోస్టింగ్ రీగెయిన్ ఫీచర్ లభిస్తుంది. ఎటువంటి యాక్సిలరేషన్ లేకుండా స్లోప్, ప్లెయిన్ రోడ్డుపై వెళుతుంది. త్వరలో ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ ’రిజ్టా’ ఆవిష్కరించేందుకు ఎథేర్ సిద్ధం అవుతున్నది. ప్రస్తుత మోడల్ స్కూటర్ల కన్నా తక్కువ ధరకే లభిస్తుంది. 450ఎక్స్ మాదిరిగా సింగిల్ చార్జింగ్‌తో 120 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. ఈ ఈ-స్కూటర్‌ను వచ్చే జూన్‌లో దేశీయ మార్కెట్లో ఆవిష్కరించేందుకు ప్లాన్ చేస్తున్నది. టీవీఎస్ ఐ-క్యూబ్, బజాజ్ చేతక్ ఈ-స్కూటర్లతో ఎథేర్ రిజ్టా పోటీ పడుతుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News