Wednesday, January 22, 2025

వైభవంగా కొనసాగుతున్న అతిరుద్ర మహాయాగం

- Advertisement -
- Advertisement -
  • బోనమ్మ అమ్మవారి ఊరేగింపు, ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే

తాండూరు: తాండూరులో అత్యంత వైభవంగా అతిరుద్ర మహాయాగం కొనసాగుతోంది. కన్నుల పండుగగా కొనసాగుతున్న యాగాన్ని వీక్షించేందుకు భక్తులకు రెండు కళ్లు సరిపోవడం లేదు. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఇంటి వద్ద నిర్వహిస్తున్న అతిరుద్ర మహాయాగం తొమ్మిదవ రోజు అంగరంగ వైభవంగా నిర్వహించారు.

తాండూరు ప్రాంతంతోపాటు చుట్టుపక్కల జిల్లాల పుణ్య దంపతులు పెద్ద ఎత్తు న తరలివస్తున్నారు. దేవతామూర్తుల భజనలు, వేద పండితుల ఆశిర్వచనాలతో మహాయాగం కొనసాగుతుంది. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి ఆద్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ రాజశ్యామల శత చండి సౌర లక్ష్మిసుదర్శన సహిత అతిరుద్ర మహాయాగంలో మంగళవారం పీఠాధిపతులు ప్రవచనాలు నిర్వహించారు.

ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఆర్తిరెడ్డి దంపతులు, కుటుంబ సభ్యులు ప్రమోదినిరెడ్డి, విఠల్‌రెడ్డి, సోదరుడు రితీష్‌రెడ్డిలు తాండూరు పట్టణంలోని పాత తాండూరు బోనమ్మ దేవాలయంలో దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంబారి సేవలో ఆది దంపతులు పార్వతి పరమేశ్వరులను బోనమ్మ దేవాలయం నుండి ఊరేగింపుగా ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్నారు. ఈ యాగంలో విప్, ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి మహాయాగంలో పాల్గొని పూజలు నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News