Friday, December 20, 2024

బ్రహ్మోత్సవాలను తలపిస్తున్న అతిరుద్ర మహాయాగం

- Advertisement -
- Advertisement -
  • అమ్మవారి ఊరేగింపు, ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి

తాండూరు: తాండూరులో కొనసాగుతున్న అతిరుద్ర మహాయాగం బ్రహ్మోత్సవాలను తలపిస్తోంది. భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు అతిరుద్ర మహాయాగం కొనసాగుతోంది. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నివాసంలో నిర్వహిస్తున్న అతిరుద్ర యాగం ఎనిమిదవ రోజు అంగరంగ వైభవంగా నిర్వహించారు.

తాండూరు ప్రాంతంతోపాటు చుట్టుపక్కల జిల్లాల పుణ్య దంపతులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ రాజశ్యామల శతచండీ సౌర లక్ష్మిసుదర్శన సహిత అతిరుద్ర మహాయాగంలో సోమవారం యాదగిరి జిల్లా తంకూరు చెందిన శ్రీశ్రీశ్రీ గంగాధర శివాచార్యులు ప్రవచనాలు వివరించారు.

ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఆర్తిరెడ్డి దంపతులు, కుటుంబ సభ్యులు ప్రమోదినిరెడ్డి, విఠల్‌రెడ్డి, సోదరుడు రితీష్‌రెడ్డిలు తాండూరు పట్టణంలోని నాగరేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మల్‌రెడ్డి ఉరమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించి ఊరేగింపుగా ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్నారు. ఈ యాగంలో తాండూరు నియోజకవర్గంలోని యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల పరిధిలోని ఆయా గ్రామాల పుణ్యదంపతులు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి అతిరుద్ర మహాయాగంలో పాల్గొన్నారు.

తాండూరు ప్రాంత దంపతులే కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన దంపతులు వచ్చిన యాగంలో కూర్చునేందుకు తగిన సౌకర్యాలు కల్పిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి సైతం యాగంలో పాలుపంచుకుని పూజలు చేసే వెసులుబాటు కల్పించడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పుణ్య దంపతులు, ప్రజలు యాగ స్థలానికి చేరుకోగానే అక్కడ ఉన్న సిబ్బంది వారిని ఆహ్వానించి ఐడికార్డులను అందజేస్తున్నారు. అదిరుద్ర మహాయాగంతో తాండూరు పట్టణం అంతా పండుగ వాతావరణం నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News