Wednesday, January 22, 2025

తండ్రి కాబోతున్న కెఎల్ రాహుల్

- Advertisement -
- Advertisement -

టీమిండియా క్రికెటర్ కెఎల్ రాహుల్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. గతేడాది జనవరిలో బాలీవుడ్ నటి అతియా శెట్టిని రాహుల్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ దంపతులు గుడ్ న్యూస్ చెప్పారు. 2025లో తమ మొదటి బిడ్డను స్వాగతించనున్నట్లు వెల్లడించారు. అతియా ప్రెగ్నెంట్ అని రాహుల్ ప్రకటించాడు.

“మా బ్యూటీఫుల్ బ్లెస్సింగ్ త్వరలోనే రాబోతోంది” అనే క్యాప్షన్ తోపాటు పక్కనే బుడి బుడి అడుగుల ఎమోజీతో ఈ జంట సోషల్ మీడియా వేదికగా తెలిపారు. దీంతో పలువురు ప్రముఖులతోపాటు అభిమానులు ఈ స్టార్ కపూల్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా, ఈ మంగళవారం అతియా తన 32వ పుట్టినరోజును జరుపుకుంది. ‘నా క్రేజీ బర్త్ డే బేబీ’.. లవ్ యూ అతియా అని KL రాహుల్ తన భార్యకు బర్త్ డే విషెస్ తెలుపుతూ రేర్ ఫోటోలను పంచుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News