Friday, January 10, 2025

ఫైనల్‌కు దూసుకెళ్లిన మురళీ, అవినాష్

- Advertisement -
- Advertisement -

Athlete Murali Srishankar into finals in World Championship

ఫైనల్‌కు దూసుకెళ్లిన మురళీ, అవినాష్
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మెరిసిన భారత అథ్లెట్లు
యుజీన్ (అమెరికా): ఇక్కడ జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్లు మురళీ శ్రీకంకర్, అవినాష్ సాబ్లే ఫైనల్‌కు చేరుకుని చరిత్ర సృష్టించారు. లాంగ్ జంప్ విభాగంలో మురళీ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారత అథ్లెట్‌గా అరుదైన రికార్డును సంతం చేసుకున్నాడు. అర్హత పోటీల్లో మురళీ అద్భుత ప్రదర్శన చేశాడు. ఏకంగా 8 మీటర్లు దూకి నేరుగా ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. మరోవైపు 3వేల మీటర్లు స్టీపుల్ ఛేజ్ విభాగంలో ఆర్మీకి చెందిన అవినాష్ సాబ్లే ఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్నాడు. క్వాలిఫయింగ్ పోటీల్లో అవినాష్ మెరుగైన ప్రదర్శన చేశాడు. 8 నిమిషాలు 18.75 సెకన్లలో 3000 మీటర్ల పరుగును పూర్తి చేసి ఫైనల్‌కు చేరుకున్నాడు. దీంతో ప్రపంచ అథ్లెటిక్స్ పోటీల్లో భారత్ రెండు పతకాల కోసం పోటీ పడనుంది.

Athlete Murali Srishankar into finals in World Championship

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News