Monday, December 23, 2024

క్రీడాకారులు ఏ రంగంలోనైనా రాణిస్తారు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: క్రీడాకారులు తలుచుకుంటే ఏ రంగంలోనైనా విజయం సాధిస్తారని తెలంగాణ క్రీడాప్రాధికార సంస్థ (శాట్స్ )ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ అన్నారు. యూపీఎస్సీ పరీక్షల్లో ఆల్ ఇండియా 51 ర్యాంకు సాధించిన సైక్లింగ్ అకాడమీ క్రీడాకారుడు మధుసూధన్ రెడ్డిని శుక్రవారం ఆయన ఘనంగా సన్మానించారు. సైక్లింగ్ క్రీడాకారుడు అన్నాడి మధుసూదన్ రెడ్డి ఇటీవల యూపీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో ఆల్ ఇండియా 51 ర్యాంక్ సాధించడం, సెంట్రల్ ఆరడ్మ్ రిజర్వు పోలీస్ విభాగంలో అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాన్ని సాధించిన సందర్భంగా ఓయూ సైక్లింగ్ వేలోడ్రమ్ స్టేడియంలో ఆయనకు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఛైర్మన్ ఆంజనేయ గౌడ్ మాట్లాడుతూ మానసిక శారీరక దృఢత్వం కలిగి ఉండే క్రీడాకారులు ఏ రంగంలోనైనా అద్భుతమైన విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని దానికి నిదర్శనమే మధుసూదన్ రెడ్డి సాధించిన ఆల్ ఇండియా ర్యాంక్ అని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా మారుమూల పల్లెలో పుట్టి, క్రీడల్లో రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించి, అదే సమయంలో సివిల్స్‌పై దృష్టి పెట్టడం అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులో మధుసూదన్ రెడ్డి తెలంగాణ గ్రామీణ క్రీడాకారులకు, యువతకు స్ఫూర్తి కలిగించేలా తన సేవలు అందించాలని ఛైర్మన్ ఆయనను కోరారు. ఈ కార్యక్రమంలో శాట్స్ డిప్యూటీ డైరెక్టర్ చం ద్రారెడ్డి, స్టేడియం అడ్మినిస్ట్రేటర్ సుధాకర్ రావు, స్టేడియం సిబ్బంది, కోచ్‌లు, సైక్లింగ్ క్రీడాకారులు పలువురు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News