Monday, December 23, 2024

క్రీడాకారులకు క్రీడా స్ఫూర్తి ఉండాలి: సిఐ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/వరంగల్: క్రీడాకారులు క్రీడా స్పూర్తితో క్రీడల్లో పాల్గొనాలని వెంకటాపురం సిఐ శివప్రసాద్, మండల తహసిల్దార్ అంటి నాగరాజులు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కాఫెడ క్రీడా మైదానంతో యూత్ స్టార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా వారు హాజరయ్యారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యక్తిలో దాగి ఉన్న వ్యక్తిగత నైపుణ్యాన్ని వెలికితీసేందుకు క్రీడలు దోహదపడుతుందన్నారు. అనంతరం క్రికెట్ పోటీల్లో విజేతలుగా నిలిచిన కొంగాల జట్టుకు రూ.30 వేల 116 నగదు, షీల్డ్‌ను అందజేశారు. రన్నర్‌గా నిలిచిన వెంకటాపురం జట్టుకు రూ.20 వేల 116 షీల్డ్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం ఎస్సై తిరుపతి, వాజేడు ఎస్సై తిరుపతిరావు, ఎస్సైలు అశోక్‌కుమార్, రాజు, వెంకటాపురం జడ్పిటిసి పాయం రమణ, ఎంపిటిసి కొండపర్తి సీతాదేవి, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు గంప రాంబాబు, నాయకులు బాలసాని వేణు, పిళ్లారిశెట్టి మురళి, చిడెం రవికుమార్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News