Wednesday, January 22, 2025

గ్యాంగ్‌స్టర్ అతీక్ హత్య

- Advertisement -
- Advertisement -

జైలునుంచి ఆస్పత్రికి తీసుకెళ్తుండగా కాల్చి చంపిన
దుండగులు కాల్పుల్లో సోదరుడూ మృతి

ప్రయాగ్‌రాజ్: ఉత్త్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఉమేశ్‌పాల్ హ త్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ హత్యకు గురయ్యాడు. జైలునుంచి మెడికల్ చెకప్ కోసం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో అతీక్‌తో పాటుగా అతని సోదరుడు అష్రఫ్ కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. మీడియా వ్యక్తులు పోలీసులు తీసు కు వెళ్తున్న ఈ ఇద్దరినీ ఫాలో అవుతుండడంతో కాల్పుల ఘటన కెమెరాల్లో రికార్డు అయింది. మెడికల్ కాలేజి సమీపంలో అతీక్ మీ డియాతో మాట్లాడుతుండగానే దుండగులు అత్యంత సమీపంనుం చి వారిపై కాల్పులు జరపడంతో ఇద్దరూ నేలపై పడిపోయారు.

కాల్పుల్లో ఇద్దరు పోలీసులకు కూడా గాయాలయ్యాయి.పోలీసులు వెంటనే కాల్పులు జరిపిన వారిపై పడి వారిని పట్టుకున్నారు. కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఈ సంచలన హత్యలతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొనడంతో తూటాల గాయాలతో ఉన్న మృతదేహాలను వెంటనే సంఘటన స్థలంనుంచి తీసుకెళ్లిపోయారు. 2005లో జరిగిన ఉమేశ్‌పాల్ హత్య కేసుకు సంబంధించి విచారణ కోసం వీరిద్దరినీ లక్నోనుంచి ప్రయాగ్‌రాజ్ కోర్టుకు తీసుకువచ్చారు. అతీక్ కుమారుడు అసద్, అతని సహచరుడిని పోలీసులు గురువారం ఓ ఎన్‌కౌంటర్‌లో కాల్చి చం పిన విష యం తెలిసిందే. వారి అంత్యక్రియలు శనివారం ఉదయం జరగ్గా అంత్యక్రియలుకు హాజరవడానికి అతీక్‌కు అనుమతి లభించలేదు. ఈ నెల 13న ఎన్‌కౌంటర్‌లో అతీక్ అహ్మద్ కుమారుడు చనిపోయాడు.

Also Read వధువు చేతిలో పిస్టల్..వరుడికి టెన్షన్(వైరల్ వీడియో)

దీంతో యుపిలో నేరాలు తారాస్థాయికి చేరాయని ఎస్‌పి నేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. పోలీసుల భద్రత ఉండగానే కాల్పులు జరుగుతున్నాయని, ఇలాంటి ఘటనల వల్ల ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News