Monday, December 23, 2024

అంగరంగ వైభవంగా అతిరుద్ర మహాయాగం

- Advertisement -
- Advertisement -
  • తరలివస్తున్న వందలాది అభిమానులు, పుణ్య దంపతులు

తాండూరు: తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి నివాసంలో అతిరుద్ర మహాయాగం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఈ మహాయాగంలో పాల్గొనేందుకు వందలాది మంది పుణ్య దంపతులు, అభిమానులు తరలివస్తున్నారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ రాజశ్యామల శత చండీ సౌర లక్ష్మిసుదర్శన సహిత అతిరుద్ర మహాయాగంలో జగద్గురు శ్రీశైలం పీఠాధిపతి డాక్టర్ శ్రీ చెన్నసిద్దరామ పండితారాధ్య శివస్వామి హాజరై ప్రవచనాలు నిర్వహించారు.

ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి దంపతులు, కుటుంబసభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించ్చారు. అమ్మవారికి సైతం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్, యాలాల, పెద్దేముల్, మండలాల పరిధిలోని ఆయా గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి అతిరుద్ర మహాయాగంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News