Wednesday, January 22, 2025

భక్తి పారవశ్యంతో అతిరుద్ర మహాయాగం

- Advertisement -
- Advertisement -

తాండూరు: భక్తి పారవశ్యంతో అతిరుద్ర మహాయాగం కొనసాగుతోంది. తాండూరు ఎమ్మేల్యే రోహిత్ రెడ్డి నివాసంలో నిర్వహిస్తున అతిరుద్ర యాగం ఏడవ రోజు కన్నుల పండుగగా నిర్వహించారు.

భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఎమ్మేల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ రాజశ్యామల శత చండి సౌర లక్ష్మిసుదర్శన సహిత అతిరుద్ర మహాయాగంలో ప్రజ్ఞ బాస్కర శృతి, స్మతి తంత్ర సృతి సార్వభౌమ ఎస్‌వి యూనివర్సిటీ అవస్తంభ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ బ్రహ్మశ్రీ వేదమూర్తులైన గోలి వెంక ట సుబ్రమణ్య వధానులు ప్రవచనాలు వివరించారు. ఎమ్మేల్యే రోహిత్‌రెడ్డి, ఆర్తిరెడ్డి దంపతులు, కుటుంబ సభ్యులు ప్రమోదినిరెడ్డి, విఠల్‌రెడ్డి, సోదరుడు రితీష్‌రెడ్డిలు సాయిపూరు నుంచి అమ్మవారిని ఊరేగింపుగా ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్నారు.

ఈ యాగంలో నియోజకవర్గంలోని తాండూరు పట్టణంతోపాటు బషీరాబాద్, యాలాల, పెద్దేముల్, మండలాల పరిధిలోని ఆయా గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి అతిరుద్ర మహాయాగంలో పాల్గొన్నారు. యాగంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా అక్కడి సిబ్బంది అన్ని ఏర్పాట్లను సిద్దం చేశారు. స్లాట్ బుకింగ్ చేసుకోకుండా వచ్చిన వారికి కూడా యాగంలో పాల్గొనే విధంగా అన్ని ఏర్పాట్లను చేపట్టారు. రోజు రోజుకు యాగంలో పాల్గొనేందుకు ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఎమ్మెల్యే నివాస ప్రాం తమంతా బ్రహ్మోత్సవాలను తలపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News