Sunday, December 22, 2024

ఇన్సూలిన్లతో తీహార్ జైలుకు ఆప్ కార్యకర్తలు!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కార్యకర్తలు ఆదివారం ఇన్సూలిన్ లతో తీహార్ జైలు వద్దకు వెళ్లారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బ్లడ్ షుగర్ లెవల్స్ 300 మార్క్ ను దాటిందని వారంటున్నారు. ‘‘మేము ఆప్ కార్యకర్తలము, ఢిల్లీ వాసులము. బిజెపి నుంచి ఉత్తర్వులు అందాక తీహార్ జైలు పాలకవర్గం ఇన్సూలిన్ విషయంలో కాస్త తగ్గింది. కేజ్రీవాల్ కు 54 యూనిట్ల ఇన్సూలిన్ అవసరం. గత 10 రోజులుగా ఆయన బ్లడ్ షుగర్ స్థాయి 300 వద్దే ఉంటోంది. ఇంత పెరిగిన స్థాయిలో ఇన్సూలిన్ అవసరం ఉంటుంది’’ అని మంత్రి ఆతిషి తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి కేజ్రీవాల్ మీద పగ పెంచుకుని అతడి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. ఆయన ప్రాణాలు హరించేలా బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగిపోతున్నాయని ఆమె వివరించారు.

ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను మార్చి 21న ఈడి అరెస్టు చేసింది. తర్వాత ఆయనను జైల్ నెం. 2లో ఉంచింది. ఆయన ఏప్రిల్ 23 వరకు జుడీషియల్ కస్టడీ కింద ఉంటారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News