Monday, December 23, 2024

క్షీణిస్తోన్న ఆతిశీ ఆరోగ్యం

- Advertisement -
- Advertisement -

కొంతకాలంగా ఢిల్లీ తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో హర్యాణా ప్రభుత్వం దేశ రాజధానికి నీటిని విడుదల చేయాలన్న డిమాండ్‌పై ఒత్తిడి తెస్తూ ఢిల్లీ మంత్రి ఆతిశీ చేపట్టిన దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. సోమవారం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు దీక్ష వల్ల ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని పేర్కొన్నారు. వెంటనే ఆస్పత్రిలో చేరాలని కోరారు. ఆతిశీ మీడియాతో మాట్లాడుతూ “ నా రక్తపోటు , చక్కెర స్థాయిలు పడిపోతున్నాయి. బరువు తగ్గాను. దీనివల్ల భవిష్యత్తులో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది.

అయినా నేను ఢిల్లీ ప్రజల తరఫున పోరాడతాను. హర్యానా నీటిని విడుదల చేసే వరకు నిరాహార దీక్షను కొనసాగిస్తాను ” అని పేర్కొన్నారు. ఎంత వేడుకున్నా హర్యానా ప్రభుత్వం రోజుకు 100 మిలియన్ గ్యాలన్ల నీటిని కూడా విడుదల చేయట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల దేశ రాజధానిలో 28 లక్షల మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆతిశీ దీక్షకు మద్దతుగా క్యాండిల్ లైట్ మార్చ్ నిర్వహిస్తామని ఆప్ పేర్కొంది.హర్యానా సిఎం నయాబ్ సింగ్ సైనీని కలిసి తమ సమస్యను పరిష్కరించాలని కోరామని , ఆయన సానుకూలంగా స్పందించారని ఢిల్లీలెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News