Wednesday, January 8, 2025

నిరవధిక నిరాహార దీక్ష విరమించిన ఆతిషి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ జల మంత్రి ఆతిషి మంగళవారం తన ఆరోగ్యం బాగా క్షీణించడంతో చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను విరమించారని, ఆమెను ఆసుపత్రిలో చేర్పించినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు. అంతేకాక ఆయన ఢిల్లీకి హర్యానా నుంచి సరైన వాటా నీళ్లను కేటాయించేలా ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయనున్నట్టు కూడా తెలిపారు. సంజయ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలు తెలిపారు.

ఢిల్లీకి నీటి సంక్షోభం తలెత్తడంతో మంత్రి ఆతిషి జూన్ 21 నుంచి నిరాహార దీక్ష చేపట్టారు. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. ఆమె ఢిల్లీలోని లోక్ నాయక్ హాస్పిటల్ లోని ఐసియూ ఎమర్జెన్సీ లో ఉన్నారు. ఆమె రక్తంలో చక్కెర పాళ్లు పడిపోయాయి. గత ఐదు రోజులుగా ఆమె ఎలాంటి ఆహారం తీసుకోకపోవడంతో పరిస్థితి విషమంగా మారింది. ‘‘ఆమె త్వరగా కోలుకోవాలి’’ అని ఆప్ ఎక్స్ లో పోస్ట్ పెట్టింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News