Monday, February 10, 2025

ఢిల్లీ సిఎంగా ఆతిశీ రాజీనామా

- Advertisement -
- Advertisement -

ఆపద్ధర్మ సిఎంగా కొనసాగాలని ఎల్‌జి సూచన
న్యూఢిల్లీ : ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) హోర పరాజయం పొందిన మరునాడు ఆదివారం ముఖ్యమంత్రి ఆతిశీ తన రాజీనామా పత్రాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్‌జి) వికె సక్సేనాకు అందజేశారు. కల్కాజీ సీటును నిలబెట్టుకున్న ఆతిశీ రాజ్ నివాస్‌లో సక్సేనాకు తన రాజీనామా లేఖను అందజేసినట్లు అధికారులు వెల్లడించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు పదవిలో కొనసాగవలసిందిగా ఆతిశీని సక్సేనా కోరినట్లు ఎల్‌జి కార్యాలయం తెలియజేసింది. ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తరువాత వచ్చే వారం ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని బిజెపి కోరవచ్చునని పార్టీ నేతలు సూచించారు.

‘లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా సిఎం ఆతిశీ రాజీనామా పత్రాన్ని అందుకున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు తన పదవిలో కొనసాగవలసిందిగా ఆమెను ఆయన కోరారు’ అని ఢిల్లీ రాజ్ నివాస్ తన అధికార ‘ఎక్స్’ వేదిక నుంచి పోస్ట్‌లో వివరించింది. ఎల్‌జి శనివారం ఢిల్లీ శాసనసభను రద్దు చేశారు. 70 అసెంబ్లీ సీట్లలోకి 48 సీట్లు గెలుచుకున్న బిజెపి సుమారు 27 ఏళ్ల తరువాత ఢిల్లీలో అధికారంలోకి తిరిగి వచ్చింది. ఆప్ 22 సీట్లు గెలుచుకున్నది. ఈ నెల 5న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా దక్కలేదు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ సిఎం పదవికి రాజీనామా చేసిన తరువాత నిరుడు సెప్టెంబర్‌లో ఆతిశీ సిఎం పదవిని అధిష్ఠించారు. తమ పార్టీ ఢిల్లీలో ‘నిర్మాణాత్మక ప్రతిపక్ష’ పాత్ర పోషిస్తుందని ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ ఆదివారం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News