Monday, December 23, 2024

సొమాలియాలో ఉగ్ర ప్రతీకార చర్య

- Advertisement -
- Advertisement -

Atleast 20 People killed in food convoy attack in Somalia

మొఘదీషు: సొమాలియాలో అల్ షబాబ్ తీవ్రవాదులు కనీసం 20 మంది ప్రయాణికులను చంపివేశారు. ఆహారం సరఫరా చేస్తున్న ఏడు వాహనాలను తగులబెట్టారు. అంతర్యుద్ధపు సోమాలియాలోని హరాన్ ప్రాంతంలో శనివారం ఈ ఘటన జరిగిందని ఇక్కడి అధికారిక వార్తాసంస్థ తెలిపింది. స్థానికులు కూడా ఈ విషయాన్ని నిర్థారించారు. అల్ ఖైదా అనుబంధ సంస్థగా అల్ షబాబ్ వ్యవహరిస్తోంది. తమ కార్యకలాపాలకు వ్యతిరేకంగా స్థానికంగా జనం సంఘటితం కావడంతో ఈ ప్రతీకార చర్యకు పాల్పడినట్లు వెల్లడైంది. ఏడు ఆహార రవాణా వ్యాన్‌లు బెలిట్వియినె నుంచి మహాస్‌కు వెళ్లుతుండగా తీవ్రవాదులు వీటిని అటకాయించారు. వీటిలోని ప్రయాణికులను, డ్రైవర్లను హతమార్చారు. తరువాత ఆహారపదార్థాలతో ఉన్న వ్యాన్లను తగులబెట్టారని స్థానికులు తెలిపారు. తమకు అడ్డుతగులుతున్న మిల్షియా సభ్యులను తాము అంతమొందించినట్లు ఆ తరువాత అల్ షబాబ్ ఓ ప్రకటన వెలువరించింది.

Atleast 20 People killed in food convoy attack in Somalia

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News