Monday, December 23, 2024

ఎటిఎం చోరీలో క్రాష్ కోర్సు: నిరుద్యోగులే టార్గెట్ !

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: కొత్త కొత్త ఐడియాలతో బడా వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు యువజనులు స్టార్టప్‌లు చేపడుతున్న కాలమిది. యువత స్వశక్తితో ఎదగాలన్న ఆకాంక్షతో ప్రభుత్వం కూడా ఆర్థికంగా చేయూతనందిస్తోంది. ఇలాంటి పరిస్థితులలో అడ్డదారిలో డబ్బు సంపాదించడం ఎలాగో నేర్పించేందుకు ఒక ప్రబుద్ధుడు యువకులకు శిక్షణ ఇస్తున్నాడు. ఇందుకోసం ఒక శిక్షణా సంస్థనే ఏర్పాటు చేశాడు. 15 నిమిషాలలో ఎటిఎం విషన్లను కొల్లగొట్టే విషయంలో శిక్షణ ఇస్తున్న ఆ బడా మోసగాడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.బీహార్‌లోని ఛాప్రాకు చెందిన ఒక వ్యక్తి ఎటిఎంలను చోరీ చేయడంలో శిక్షణ ఇచ్చేందుకు నిరుద్యోగ యువకుల కోసం ఒక స్టార్టప్ నడిసిస్తున్నాడని తెలిసి ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఫాకయ్యారు.
ఉత్తర్ ప్రదేశ్‌లోని ల్కో నగరంలో సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీసు స్టేషన్ పరిధిలోని ఒక ఎటిఎం నుంచి రూ. 39.58 లక్షలు చోరీ చేసిన నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నపుడు ఈ విషయం బయటపడింది. ఆ నలుగురు యువకుల నుంచి రూ. 9.13 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పాన్ ఇండియా ముఠాకు నాయకుడిగా వ్యవహరిస్తున్న సుధీర్ మిశ్రా కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. ఈ వ్యక్తి కోసం ఇప్పటివరకు 1,000 సిసిటివి ఫుటేజ్‌లను, మొబైల్ డాటాను, 20 టోల్ ప్లాజాలను పరిశీలించినట్లు యుపికి చెందిన ఒక సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. ఈ దర్యాప్తులో ఒక ఎటిఎం సమీపంలోని ఒక ఇంటి వద్ద నిలిపివున్న నీలం రంగు కారు పోలీసులకు కంటపడింది.

Also Read: సూపర్ స్టార్ రజనీకాంత్ కు మంత్రి రోజా కౌంటర్

ఇంట్లో నుంచి బయటకు వచద్చిన నలుగురు వ్యక్తులు కారులో నగరం విడిచి వెళ్లిపోవడం కనిపించింది. ఒక పోలీసు బృందం ఆ కారు యజమాని అడ్రసు ద్వారా బీహార్‌లోని సీతామఢికి చేరుకున్నారు. మరో పోలీసు బృందం యుపిలోని స్తున్‌పూర్ రోడ్డులో అదే కారును అడ్డగించారు. ఈ కారులోనే నలుగురు యువకులు పట్టుబడ్డారు. వీరిలో ఒకడైన నీరజ్ ఆ గ్యాంగులో శాశ్వత సభ్యుడని, ఇతనిపైన ఐదు కేసులు ఉన్నాయని గోల్ఫ్ సిటీ ఎస్‌హెచ్‌ఓ శైలేంద్ర గిరి తెలిపారు. మిశ్రా నుంచే తాను ఎటింఎంలను పగలగొట్టడానికి సంబంధించిన చిట్కాలు నేర్చుకున్నానని నీరజ్ వెల్లడించినట్లు ఆయన చెప్పారు. మిశ్రా పెద్ద గ్యాంగును నిర్వహిస్తున్నాడని, వివిధ రాష్ట్రాలకు చెందిన యువకులను ఇందుకోసం వినియోగిస్తున్నాడని ఆయన చెప్పారు.
ఈ యువకులను యుపి నుంచి ఛాప్రాకు తీసుకువచ్చి అక్కడ మూడు నెలల క్రాష్ కోర్సు ఇస్తున్నాడు.

ఎటిఎంలోకి ఎలా వేగంగా ప్రవేశించాలి, తమ ముఖాలు తెలియకుండా ఉండేందుకు ఎటిఎం బూత్ అద్దాలపైన లిక్విడ్ స్ప్రే చేయడం, 15 పిమిషాలలో ఎటిఎం క్యాష్ బాక్స్‌ను కట్ చేసి డబ్బు తస్కరించడం వంటివి ఈ శిక్షణలో భాగం. శిక్షణ పూర్తయిన తర్వాత ఈ యువకులకు లైవ్ ప్రాక్టికల్స్ కూడా చూపిస్తారు. 15 నిమిషాలలో పని పూర్తి చేయగల సామర్ధం ఉన్నవారినే ముఠాలో సభ్యులుగా చేర్చుకుంటున్నారని ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. గత ఏడాది కాలంలో ఈ ముఠా దేశవ్యాప్తంగా 30కి పైగా ఎటిఎం చోరీలకు పాల్పడిందని ఆయన వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News