Sunday, December 29, 2024

రూ.60 లక్షలతో ఎటిఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్ పరార్

- Advertisement -
- Advertisement -

ATM cash van driver escape with Rs 60 lakh in Kadapa

కడప: లాజిస్టిక్స్ సంస్థ డ్రైవర్ రూ.60 లక్షల నగదు వ్యాన్‌తో పరారైన సంఘటన కడపలో జరిగింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లోని ఏటీఎంలలో బ్యాంకు ఇచ్చిన నగదును ఒక ఏజెన్సీ నింపుతుంది. ఏజెన్సీ సిబ్బంది శుక్రవారం సాయంత్రం బ్యాంకు నుంచి రూ.80 లక్షల నగదు తీసుకుని వాహనంలో బయలుదేరారు. ఐటిఐ సర్కిల్‌లోని బ్యాంకు ఏటీఎం వద్దకు సిబ్బంది వెళ్లగా డ్రైవర్‌ షారుఖ్‌ వాహనంతో పరారయ్యాడు. వాహనంలో సుమారు రూ.60 లక్షల నగదు ఉన్నట్లు అధికారులు తెలిపారు. శివారులోని వినాయకనగర్‌ వద్ద డ్రైవర్‌ వాహనాన్ని వదిలి నగదుతో పరారయ్యాడు. బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News