చెన్నై: పోలీసులు కళ్లెదుటే ఎటిఎంలో చోరీకి యత్నించిన నలుగురు యువకులు ఓ వ్యక్తిని గుండెలో పొడిచిన సంఘటన తమిళనాడులోని తిరువారూర్-తిరుత్తురై పూండిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కూడూరు గ్రామంలో జాతీయ బ్యాంక్‌కు సంబంధించిన ఎటిఎం ఉంది. అర్ధరాత్రి ఎటిఎంలో నలుగురు యువకులు చొరబడి దొంగతనానికి పాల్పడుతుండగా మదన్ అనే వ్యక్తి గురించి పోలీసులు, భవన యాజమాని తమిళరసన్‌కు ఫోన్ చేశాడు. తమిళరసన్ అప్పటికప్పడు ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేశాడు. ఎటిఎం వద్ద జనం ఎక్కువగా రావడంతో నలుగురు యువకులు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ముగ్గురు తప్పించుకోగా ఒకరు పట్టుబడ్డారు. పోలీసులు ఆ యువకుడిని పట్టుకున్నారు. మెరుపువేగంతో మిగతా ముగ్గురు కత్తులతో పోలీసులుపైకి దాడి చేయడానికి దూసుకొచ్చారు. తమిళరసన్ వారిని ఆపేందుకు ముందుకు రావడంతో గుండెలో కత్తితో పొడిచారు. పోలీసులు అదుపులో ఉన్న నిందితుడిని విడిపించుకొని నలుగురు పారిపోయారు. పోలీసులు యంత్రాంగ అప్రమత్తమై కుర్తానల్లూరులో దాగి ఉన్న నలుగురు దొంగలను పట్టుకున్నారు. పట్టుకునే క్రమంలో ఇద్దరు కాల్లు విరగగా మరో ఇద్దరివి చేతులు విరిగాయి. వారిని ఆస్పత్రికి తరలించి కట్టు కట్టారు. పోలీసులు విచారణలో దారి దోపిడీలతో పాటు ద్విచక్రవాహనాలను దొంగతనం చేశామని ఒప్పుకున్నారు.
ఎటిఎం చోరీ….. గుండెల్లో కత్తితో పొడిచి….
- Advertisement -
- Advertisement -
- Advertisement -