Monday, December 23, 2024

బైక్‌ను ఢీకొట్టి…. మృతదేహంతో 18 కి మీ ప్రయాణించిన కారు

- Advertisement -
- Advertisement -

అమరావతి: బైక్‌ను కారుతో ఢీకొట్టి అనంతరం వాహనంపై పడిన మృతదేహంతో 18 కిలో మీటర్లు ప్రయాణించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం వైకొత్తపల్లి గ్రామ శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. చోళ సముద్రం గ్రామానికి చెందిన జిన్నే ఎర్రిస్వామి(35) ట్రాక్టర్ మెకానిక్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పి.సిద్దరాంపురం గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకొని అనంతపురంలో ట్రాక్టర్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. పి సిద్దరాంపురం గ్రామంలో పని చూసుకొని రాత్రి తొమ్మిది గంటల సమయంతో అనంతపురంకు బయలు దేరాడు. వై కొత్తపల్లి గ్రామ శివారులోకి రాగానే ఎదురుగా కారు వచ్చి అతడి బైక్‌ను ఢీకొట్టింది. అతడు ఎగిరి కారు పడ్డాడు. అది గమనించిన డ్రైవర్ వేగంగా కారును కళ్యాణదుర్గం వైపు మళ్లించాడు. వాహనదారులు గమనించి బెళుగప్ప మండలం హనిమిరెడ్డిపల్లి వద్ద కారును ఆపారు. వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. కారుపై మృతదేహంతో దాదాపుగా 18 కిలో మీటర్లు ప్రయాణించింది. కారు బెంగళూరుకు చెందిన వ్యక్తిదిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News