Saturday, November 23, 2024

బొమ్మల తయారీలో ఆత్మనిర్భర్ సాధించాలి

- Advertisement -
- Advertisement -

ఇండియా టాయ్ ఫేర్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ప్రపంచ మార్కెట్‌లో దేశీయ పరిశ్రమ వాటా మరింత పెరిగేందుకు చేసే కృషిలో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణ హితం, పునరుద్పాకతతో కూడిన ఆట బొమ్మల తయారీకి కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ బొమ్మల తయారీదారులకు శనివారం పిలుపునిచ్చారు. దేశంలోనే మొదటి సారి ఏర్పాటు చేసిన ఇండియా టాయ్ ఫేర్‌ను శనివారం ప్రధాని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఆట బొమ్మల రంగంలో ఆత్మనిర్భర్ సాధించాలని, ప్రపంచ విపణిలో స్థానం సంపాదించుకోవాలని సూచించారు. ఆట బొమ్మల మార్కెట్‌లో భారత్ వాటా 100 బిలియన్ డాలర్లు మాత్రమేనని, ఇది చాలా తక్కువని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో తయారయ్యే ఆట బొమ్మలలో 85 శాతం వాటి వనరులు విదేశాల నుంచి తెప్పించుకున్నవేనని ఆయన చెప్పారు. ఆట బొమ్మల రంగంలో భారతదేశానికి సాంప్రదాయంతోపాటు టెక్నాలజీ, భావనలు, సామర్ధం కూడా ఉన్నాయని, మన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల ద్వారా మన దేశానికి చెందిన ప్రాచీన కథలను కంప్యూటర్ గేమ్స్ రూపంలో ప్రపంచానికి పరిచయం చేయవచ్చని ప్రధాని అన్నారు. దేశంలో హస్తకళాకారులు తయారు చేసే బొమ్మలను ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు.

బొమ్మల పరిశ్రమకు ప్రభుత్వం అందచేస్తున్న చేయూతను ప్రస్తావిస్తూ దేశంలోని 24 ప్రధాన రంగాలలో బొమ్మల పరిశ్రమను కూడా ప్రభుత్వం చేర్చిందని చెప్పారు. జాతీయ బొమ్మల తయారీ కార్యాచరణ ప్రణాళికను కూడా ప్రభుత్వం రూపొందించిందని ఆయన తెలిపారు. బొమ్మల తయారీ పరిశ్రమల ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యాన్ని కూడా తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా చెన్నపట్న, వారణాసి, జైపూర్‌కు చెందిన సాంప్రదాయ బొమ్మల తయారీదారులతో ప్రధాని ముచ్చటించారు. టాయ్ ఫేర్ 2021లో 1,000 మందికి పైగా తయారీదారులు తాము తయారుచేసిన బొమ్మలతో ప్రదర్శన నిర్వహించారు. మార్చి 2వ తేదీ వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News