Friday, December 27, 2024

డేటింగ్ యాప్‌లతో దారుణాలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ :సమాజంలో ఇప్పుడు తలెత్తిన వికృత లక్షణాలు యువతను ఈ విధంగా బలి తీసుకుంటున్నాయని, ప్రత్యేకించి డేటింగ్ యాప్‌లతో అర్థంపర్థం లేని స్నేహాలు ఏర్పడుతున్నాయని, ఇవి చివరికి వికటించి దారుణాలకు దారితీస్తున్నాయని వికాస్ వాకర్ చెప్పారు. తప్పుదోవ పట్టిస్తున్న పలు డేటింగ్ యాప్‌లను అరికట్టాల్సి ఉందన్నారు. తన కూతురు (శ్రద్ధా వాకర్) వంటి ఘటనలు ఇక ముందు జరగకుండా చూడాల్సి ఉందన్నారు. పలువురు ఇటువంటి యాప్‌లను వాడుకుంటున్నారు.

వారిపై తల్లిదండ్రుల అదుపాజ్ఞలు లేకుండా పోతున్నాయి. అఫ్తాబ్ వేరే వర్గానికి చెందిన వ్యక్తి, ఆయనతో తన కూతురు కలిసి ఉండటం తనకు ఏ కోశానా నచ్చలేదన్నారు. పోనీ ఆ వ్యక్తితోనే కలిసి సజీవంగా ఉందా? అంటే అదీ లేదన్నారు. తాను ప్రాణాపాయ స్థితిలో ఉన్నానని తన కూతురు పలు సార్లు స్థానిక వాసయ్, నాలాసోపారా పోలీసులకు ఫిర్యాదు చేసిందని, అయితే వీటిని వారు పట్టించుకోలేదని శ్రద్ధా వాకర్ తండ్రి ఆరోపించారు. వారు పట్టించుకుని ఉంటే ఇప్పటికీ తన కూతురు బతికే ఉండేదని తెలిపారు. పోలీసుల నిర్లక్ష్యం గురించి దర్యాప్తు చేయాలని వికాస్ కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News