Tuesday, December 24, 2024

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం

- Advertisement -
- Advertisement -

నల్గొండ : నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యంతో రోగులకు పడిగాపులే మిగిలిపోతున్నాయి. ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి. లక్షలు ఖర్చుపెట్టి వైద్యం చేయించుకునే స్తోమత లేని పేదలు సరైన వైద్యం అందకుంటే ఎటు పోవాలి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూ పాయలను ఖర్చుపెట్టి పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది ని ర్లక్ష్యం కారణంగా పేదలకు వైద్యo అందక నానా అవస్థలు పడుతున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మరో కవలల మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే నవ్య బంధువులు తెలిపిన ప్రకారం నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం కురుమర్తి గ్రామానికి చెందిన నవ్య డెలివరీ కోసమని నాలుగు రోజుల క్రితం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. కడుపులో కవల శిశువులు ఉన్నారని ఆపరేషన్ చేస్తామని చెప్పిన వైద్యులు ఆపరేషన్ చేయకపోవడం వల్ల కడుపులోనే శిశువులు మరణించారు. సర్కారు మాటలే తప్ప రోగుల అవస్థలను వైద్యులు ఏమాత్రం పట్టించు కోవడంలేదని, ఆపరేషన్ అవసరమని తెలిసినా నార్మల్ డెలివరీ కోసం వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించాలని.. నొప్పులు రాకుండా ఇంజక్షన్లను, మాత్రలు ఇచ్చారని పేర్కొన్నారు.

కడుపులో కవల పిల్లలు ఉన్నారని తెలిసిన నవ్య గత ఏడు నెలల క్రితమే ఆసుపత్రిలో చేరింది. అయితే గత పది రోజుల క్రితం అంతా బాగానే ఉంది అంటూ వైద్యులు ఇంటికి పంపించి వేశారు. అయితే కడుపులో ఇబ్బ ందిగా ఉంది అంటూ గత సోమవారం తిరిగి నవ్య ఆస్పత్రిలో జాయిన్ అయినా ఎమర్జెన్సీ కేసు కింద ట్రీట్ చేసి ఆపరేషన్ చేయకుండా వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కడుపులో కదలికలు లేవని చెప్పడంతో వైద్యులు స్కానింగ్ చేయించుకొని రమ్మని బయటికి పంపించేశారు. స్కానింగ్ చేసిన సదరు స్కానింగ్ నిర్వాహకులు కడుపులోని శిశువులకు ఏమాత్రం కదలికలు లేవని చెప్పడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తిరిగి వచ్చిన నవ్య అదే విషయాన్ని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు చెప్పినప్పటికీ అప్పుడు కూడా ఆపరేషన్ చేయకుండా నలుగురికి ఆపరేషన్ చేసిన అనంతరం ఆపరేషన్ చేసి చివరకు మృతి చెందిన కవల పిల్లలను బయటకు తీశారు. పిల్లలిద్దరూ చనిపోయారంటూ బంధువులకు చూపించారు.

శిశువులను చూసిన బంధువులు బోరున విలపిస్తూ శిశువులు ఎలా మరణిస్తారని ప్రశ్నించడంతో అక్కడి నుండి వెళ్ళిపోవాలంటూ సెక్యూరిటీ గార్డులు బలవంతంగా బయటికి పంపించి వేశారు. దీంతో నవ్య బంధువులు ప్రభుత్వ ఆసుపత్రి బయట ధర్నా నిర్వహించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మీరు వెళ్లి పోవాలంటే అక్కడి నుండి వారిని పంపించి వేశారు. కాగా డెలివరీ అనంతరం నవ్యకు ఆక్సిజన్ సరిగా అందకపోవడంతో వైద్యులు చికిత్సను అందజేస్తున్నారు. బంధువులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించి శిశువుల మరణానికి కారణమైన వైద్యులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరొకసారి ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. న్యాయం జరగని పక్షంలో జిల్లా కలెక్టర్‌ను సైతం కలిసి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.

బీఎస్పీ మద్దతు.. బహుజన సమాజ్ పార్టీ బివిఎఫ్ నల్లగొండ జిల్లా కో కన్వీనర్ పెరిక అభిలాష్, నల్లగొండ నియోజకవర్గం ఇంచార్జ్ కొల్లోజు వినోద్ చారి, మండల ఉపాధ్యక్షులు నవీన్‌లు మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తరచూ మరణాలు సంభవిస్తున్నాయని దీనిపై సమగ్ర విచారణ చేపట్టి ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలన్నారు.

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు..
– డాక్టర్. లచ్చు నాయక్, సూపరింటెండెంట్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, నల్గొండ
వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే చర్యలు తప్పవు. నవ్య రెండవ కాన్పు కోసం గత నాలుగు రోజుల క్రితం హాస్పిటల్లో చేరింది. అప్పటి నుంచి వైద్య సేవలను అందిస్తున్నాం. జరిగిన సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తాం. నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిస్తే చర్యలు తీసుకుంటాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News