Tuesday, January 21, 2025

నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం దారుణం చోటుచేకుంది. లక్ష్మి నరసింహ కాలనీలోని నిర్మానుష్య ప్రాంతంలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. మృతుడిని మల్లికార్జునగా గుర్తించారు. దుండగులు మల్లికార్జున్ ని గొంతు కోసి ప్రాణాలు తీశారు. ఘటన ప్రాంతంలో మద్యం బాటిళ్ల గుర్తించారు. ఇద్దరు వ్యక్తులు మల్లికార్జునను ఇంట్లో నుండి ఉదయం తీసుకుని వెళ్లినట్లు తెలుస్తోంది. వారిపైనే కుటుంబ సభ్యుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News