Sunday, January 19, 2025

సంగారెడ్డిలో దారుణం

- Advertisement -
- Advertisement -
  • భార్యను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న భర్త

సంగారెడ్డి: భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పోతిరెడ్డిపల్లిలోని 12వార్డులో జరిగింది. శనివారం సంగారెడ్డి రూరల్ ఎస్‌ఐ రాజేష్ నాయక్ తెలిపిన కథనం ప్రకారం పోతిరెడ్డిపల్లి కాలనీలోని వీకర్ సెక్షన్‌లో అల్లం యాదగిరి (36) స్థానికంగా ఫ్లంబర్ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఉదయం యాదగిరి భార్య యశోద(30)ను ఇంట్లోనే గొంతు కోసి హత్య చేశాడు. వెంటనే యాదగిరి కూడ ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసకున్నాడన్నారు. పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్నీ క్లూస్‌టీం, పోలీసు ఉన్నతాధికారులు సందర్శించి హత్యకు గల కారణాలను ఆరా శారు. కేసు నమోదు చేసుకొని శవాలను పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని రూరల్ ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News